ఐపీఎల్లో భాగంగా రేపు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా మ.3:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలుకానుంది.