TG: రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాల్లో గల ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 1998 వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా 652 ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మారుస్తున్నట్లు తెలిపారు.