కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో రామారెడ్డి, రెడ్డిపేట, అన్నారం, మద్దికుంట, ఉప్పల్ వాయి తదితర గ్రామాలలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో చేశారు. యేసుక్రీస్తు మానవుల శాపముల కొరకు సిలువలో మరణించారని బైబిలు గ్రంథం బోధిస్తుందని పాస్టర్ అమోస్ పేర్కొన్నారు. మానవ అవతారిగా జన్మించి మానవుల రక్షణ కోసం తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టారని చెప్పారు.