MBNR: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘విజన్ 2047’లో భాగంగా పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలల విస్తరణను వేగవంతం చేసి, మహబూబ్‌నగర్‌ను ‘ఎడ్యుకేషన్ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు.