CTR: వరుస సెలవుల నేపథ్యంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తాగునీరు, క్యూలైన్ నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తులు సజావుగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.