MBNR: న్యాయవాదుల సంక్షేమం, రక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నూతన బార్ కౌన్సిల్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. సమాజంలో న్యాయాన్ని నిలబెట్టడంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.