Virat Kohli: విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులు సంబరం చేసుకునే రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ ప్రారంభం అయింది. క్రికెట్ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సీజన్ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీతో ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ పరాజయం చెందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సైతం తన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చాడు. కానీ రెండో మ్యాచ్ డబల్ ఉత్సాహాంతో చెలరేగిపోయాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఫలితంగా జట్టుకు విజయం వరించింది. ఈ క్రమంలో విరాట్ ఓ రికార్డును నెలకొల్పాడు. పంజాబ్ జట్టుపై అద్భుత ప్రదర్శనతో 49 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స్‌లతో చెలరేగి 77 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్లో 100 సార్లు 50 పైగా స్కోరు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వీటిలో 8 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదే ఫార్మెట్లో క్రిస్ గేల్ 110 సార్లు ఆఫ్ సెంచరీలు సాధించి మొదటి స్థానంలో ఉండగా, ఆల్ రౌండర్ డేవిడ్ వార్నర్ 109 సార్లు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మూడో స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 377 ఇన్నింగ్స్ ఆడారు విరాట్. కోహ్లీకి ఈ సీజన్లో తొలి అర్ధశతకం ఇది. మరోవైపు టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడు కోహ్లీనే. పంజాబ్‌తో జరిగిని మ్యాచ్‌లో బెయిర్‌స్టో క్యాచ్ పట్టడంతో మొత్తం 173 క్యాచ్‌లు పట్టి సురేశ్ రైనా(172)ను వెనక్కి నెట్టి ఈ జాబితాలో తొలి స్థానానికి చేరాడు. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ(167), మనీశ్ పాండే(146) ఉన్నారు. బెంగళూరు తదుపరి మ్యాచ్ కోల్‌కతాతో ఆడనుండగా కోహ్లీ ఫ్యాన్స్ ఉత్సహాంగా ఉన్నారు.