ELR: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు చేసిన సేవలు ఎంతో ప్రశంసనీయం అని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొనియాడారు. శుక్రవారం బుట్టాయిగూడెంలో సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో వారిని సన్మానించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజల మధ్యలో ఉండి, భయపడకుండా సేవలు అందించడం వారి అంకితభావానికి నిదర్శనమని తెలిపారు.