PPM: జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పాచిపెంట మండలంలో పలు గ్రామాలలో వెలుగు ఆధ్వర్యంలో గురువారం రాత్రి అమరావతి అమర దీపం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాచిపెంట, పాంచాలి, పణుకువలస, విశ్వనాథాపురం, కేరంగి, గొట్టూరు తదితర గ్రామాలలో మహిళ సంఘాలు సభ్యులు ఇంటి ముందు దీపాలు వెలిగించి, క్యాండిల్ ర్యాలీ లు చేపట్టారు.