వివాహేతర సంబంధాల కోసం రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ భారత్లో విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ వినియోగదారుల సంఖ్య 40 లక్షల (4 మిలియన్ల) మైలురాయిని దాటినట్లు కంపెనీ వెల్లడించింది. యూజర్లలో 18% మందితో బెంగళూరు మొదటి స్థానంలో, ఆ తర్వాత స్థానంలో 17% యూజర్లతో హైదరాబాద్ నిలిచింది. వీటి తర్వాత ఢిల్లీ (11 శాతం), ముంబై (9 శాతం), పుణె (7 శాతం) నగరాలు ఉన్నాయి.