PDPL: కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు, జిల్లా బీసీ అధికారి పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బిసి అభివృద్ధి అధికారి, జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.