NZB: మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.