HNK: కొత్తగట్టు సింగారం గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. స్థానిక సర్పంచ్ కూకిడి శివాజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం సమన్వయంతో పని చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.