MHBD: నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామ స్టేజీ వద్ద బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా కనిపించిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో రూ.2.7 లక్షల విలువ చేసే 20 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కిలోల పటిక, 5లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.