గుంటూరులో పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఆర్ కానిస్టేబుల్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. కోరిటపాడు మూడో లైన్‌లోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట జరుగుతున్నట్లు గుర్తించగా.. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ శివ నాగరాజు రెడ్డి కూడా ఉన్నాడు. ఘటనపై ప్రాథమిక విచారణ నిర్వహించి, అనంతరం అతన్ని సస్పెండ్ చేస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తర్వులు జారీ చేశారు.