NRML: నిర్మల్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వేసవిలో గ్రామంలోకి వచ్చే నాసిరకం ఐస్ క్రీం బండ్లు, ఆటోలపై పూర్తిగా నిషేధం విధిస్తూ గురువారం తీర్మానం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని పాలకవర్గం హెచ్చరించింది. గ్రామస్థులు సహకరించాలని సర్పంచ్, కార్యదర్శి కోరారు.