ATP: జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ వై.చిన్న సుబ్బరాయుడు, సహచర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జౌళి, చేనేత శాఖల ఏడీ వరప్రసాద్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, శాఖాపరమైన అంశాల గురించి అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.