VZM: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ బిల్లు ఆమోదించడం ప్రతి తెలుగోడు గర్వించే విషయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు నాయుడు కృషి అమోఘమని కొనియాడారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను అభినందించారు.