VKB: పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యా బోధనను పరిశీలించారు.