NLR: నెల్లూరు కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశాలతో బుధవారం వావిలేటిపాడు, అల్లీపురం ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ పర్యవేక్షణలో వీధి శునకాలను పట్టుకొని, వాటిని సంతానోత్పత్తి నియంత్రణ కోసం ఏబీసీ సెంటర్కు తరలించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.