సూర్యరశ్మి లేని చోట కూడా పనిచేసే అణు బ్యాటరీలను నాసా తయారు చేస్తోంది. ప్లూటోనియం కంటే ఎక్కువ కాలం మన్నే అమెరిషియం అనే ఇంధనాన్ని ఇందులో వాడుతున్నారు. దీనివల్ల అంతరిక్ష నౌకలు వందల ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. చీకటి గ్రహాలపై పరిశోధనలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్లో అంతరిక్ష ప్రయోగాలకు ఇవే ప్రధాన ఆధారంగా మారనున్నాయి.