ఫుట్బాల్ ప్రపంచకప్ మ్యాచులు ఈ ఏడాది జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 19న అమెరికాలోని న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లకు భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాప్ కేటగిరీ టికెట్లను ఫిఫా భారీగా పెంచింది. ఒక్కో టికెట్ ధరను 10,990 డాలర్లు (రూ.10.19 లక్షలు)గా నిర్ణయించింది.