MLG: చల్వాయి గ్రామంలో 41 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం అందించారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తన తండ్రి చేతుల మీదుగా చెక్కు అందజేశారు. విగ్రహ నిర్మాణం పూర్తయ్యే వరకు మొత్తం ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.