KRNL: జిల్లాలో మున్సిపల్ వార్డుల సంఖ్య పెరిగింది. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు కూడా పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని రాజకీయ అవకాశాలు దక్కనుండటంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడంతో పాలన మరింత చేరువవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కాగా యువ నాయకత్వానికి ఇది సరికొత్త నాంది కానుంది.