BHPL: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై 60 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. ఈ మందును విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని పురుగుమందుల డీలర్లు నిబంధనలు ఉల్లంఘించకుండా సహకరించాలని, అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.