JN: రైతు ఉత్పత్తిదారుల సంస్థలో రైతులు సభ్యత్వం తీసుకోవాలని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ అన్నారు. నెల్లుట్ల గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.