MLG: వెంకటాపూర్ గ్రామంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ నిర్వహించనున్నారు. దీంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన జరగనున్నట్లు గ్రామ సర్పంచ్ మామిడిశెట్టి సుగుణ-స్వామి తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరుకానునట్లు ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.