ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమావేశం నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు చికెన్ సీనా, రామకృష్ణ మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కలు, కోతులు, పందుల బెడద ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.