అన్నమయ్య: మదనపల్లె మండలం 150వ మైలు సమీపంలోని నీలగిరి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన బుధవారం కలకలం రేపింది. తోటలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వైపు వ్యాపిస్తున్నట్లు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.