నల్గొండ మండలం అప్పాజీపేటలో బుధవారం కార్మిక సంఘాలు బ్లాక్ డే నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయడానికి నిరసిస్తూ CITU మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కాసర్ల వెంకన్నతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.