W.G: ఆచంటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని కలెక్టర్ నాగరాణి బుధవారం ప్రారంభించారు. జిల్లాలోనే అత్యంత హంగులతో కార్యాలయం నిర్మించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీవో దాసిరాజు, జడ్పీటీసీ సురేష్ బాబు, ఎంపీపీ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.