WGL: జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంతో ప్రతి సర్కిల్‌కు డీఈ (టెక్నికల్) అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించినట్లు WGL NPDCL SE గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం అన్ని సెక్షన్ కార్యాలయాల్లో “పెప్ టాక్” నిర్వహించి ఉద్యోగులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి జీవితం అత్యంత విలువైనదన్నారు.