జనగామ పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్న అనిల్ ఇటీవల మరణించగా, ఆయన కుటుంబానికి జనగామ పోలీస్ సిబ్బంది ఆర్థిక సహాయం అందించారు. అనిల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న నేపథ్యంలో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రూ.80 వేల నగదును సేకరించి చెక్కు రూపంలో CI సత్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.