BHPL: రేగొండ (M) నారాయణపూర్ GPలో కార్యదర్శిగా ఎవరూ విధులు నిర్వహించలేమని మండలంలోని GP కార్యదర్శులు ఇవాళ MPDO వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో విధులకు వెళ్లే కార్యదర్శుల పట్ల పాలకవర్గం సభ్యులు సమన్వయం లేక అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యకు త్వరిత పరిష్కారం చూపాలని మండల కార్యదర్శులు డిమాండ్ చేశారు.