అక్కినేని నాగార్జున, దర్శకుడు రా. కార్తీక్ కాంబోలో ‘కింగ్ 100’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాపై నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ కేవలం టెక్నికల్ వండర్ మాత్రమే కాదు, గుండెల్ని హత్తుకునే ఎమోషనల్ డ్రామా అని తెలిపారు. సున్నా నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి స్ఫూర్తిదాయక ప్రయాణంతో పాటు, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన సెంటిమెంట్ ఈ కథకు ప్రధాన బలమని అన్నారు.