SKLM: ఆముదాలవలస మండలం కొరపాం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇంటింటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, అర్హులందరికీ న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తుందన్నారు.