పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు BCCI షాక్ ఇచ్చింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల ఫైన్ విధించింది. దీంతో ఈ సీజన్లో ఫైన్ ఎదుర్కొన్న తొలి సారథిగా అయ్యర్ నిలిచాడు. కాగా ఏదైనా టీమ్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే సారథికి తొలిసారి రూ.12 లక్షలు, 2వ సారి రూ.24 లక్షలు ఫైన్ విధిస్తారు. 3వ సారి రూ.30 లక్షల ఫైన్+ ఓ మ్యాచ్ నిషేధం ఉంటుంది.