విశాఖ 35వ వార్డులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీతమ్మపేటలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఆ పార్టీ నేతలు జనసేనలో చేరారు. వార్డు అధ్యక్షుడు లెంక త్రినాధ్, కడవల రఘు ఆధ్వర్యంలో వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గండిబోయిన చిన్నతో పాటు సుమారు 50 మంది యువకులు జనసేన కండువా కప్పుకున్నారు.