కృష్ణా: గత ప్రభుత్వంలో వ్యవస్థలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిందని మాజీ CM జగన్‌పై MLA బోడె ప్రసాద్ విమర్శించారు. ఉయ్యూరు(M) చిన్న ఓగిరాలలో పెన్షన్లు పంపిణీ చేసి, రూ.30 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను బుధవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోనూ రూ.100 కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు.