కర్నూల్ పొగాకు రైతులకు ఆరంభంలోనే షాక్ తగిలింది. గతేడాదితో పోలిస్తే ప్రారంభ ధర కిలోకు రూ.25 చొప్పున తగ్గించారు. 2025 మార్చిలో ఉత్తరాది నల్ల నేలల్లో కిలో రూ.290 చొప్పున వేలం ప్రారంభించారు. పెట్టుబడులు భారీగా పెరగడంతో ఈ ఏడాది కిలోకు కనీసం రూ.320 ఇస్తారని రైతులు ఆశించారు. కానీ బోర్డు మాత్రం ప్రారంభ ధరగా రూ.265 మాత్రమే నిర్ణయించారు.