WNP: జిల్లాలో నేటి నుంచి పాల ధరలను పెంచుతున్నట్లు జిల్లా పాల ఉత్పత్తి రైతుల సంఘం ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం లీటరు పాలు రూ.90, కిలో పెరుగు రూ.110గా నిర్ణయించారు. మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు పెరగడంతో పాల రేట్లు పెంచక తప్పలేదని రైతులు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని కోరారు.