AP: కూటమి పాలనలో ఎటు చూసినా ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోందని జగన్ విమర్శించారు. ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని.. ప్రజల కోసం తాము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల పనులు ముందుకు సాగట్లేదని, రైతులకు గిట్టుబాటు ధరలు అందే పరిస్థితి లేదని, RBKలు నిర్వీర్యమైపోయాయన్నారు.