»Bengaluru Traffic Helps Groom Ditch Newly Wed Bride Wife Chases Him On Road
Viral News : ట్రాఫిక్ లో ఇరుక్కున్న కారు… ఛాన్స్ దొరికిందని పారిపోయిన వరుడు…!
Viral News : బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయితే... ఈ ట్రాఫిక్ ఓ పెళ్లికొడుక్కి మాత్రం వరంగా మారింది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అతనికి ఆ ట్రాఫిక్ సహాయపడింది.
బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయితే… ఈ ట్రాఫిక్ ఓ పెళ్లికొడుక్కి మాత్రం వరంగా మారింది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అతనికి ఆ ట్రాఫిక్ సహాయపడింది. ఇష్టం లేని పెళ్లి నుంచి పారిపోవడానికి ట్రాఫిక్ ఉపయోగపడింది. వధువును వదిలేసి పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే….
చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన విజయ్ జార్జ్ అనే యువకుడికి ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఇద్దరూ… చర్చికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో వీరి కారు మహాదేవపుర టెక్ కారిడార్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ సమయంలో ముందు సీటులో కూర్చున్న విజయ్ జార్జ్.. ఠక్కున డోరు తీసుకుని బయటకు పరుగులు తీశాడు. భర్త అలా చేయడంతో షాక్‌లోకి వెళ్లిపోయిన యువతి.. వెంటనే తేరుకుని అతడి వెంట పరుగులు తీసింది. అయినా అందుకోలేకపోయింది. రెండు వారాలు దాటినా భర్త ఆచూకీ తెలియకపోవడంతో ఆమె మార్చి 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘‘విజయ్ జార్జ్ తండ్రి కర్ణాటక, గోవాలో మ్యాన్‌పవర్ ఏజెన్సీలను నిర్వహిస్తున్నాడు.జార్జ్….తన తండ్రి ఏజెన్సీస్ లో సహాయం చేసేవాడు. ఈ క్రమంలోనే తన కారు డ్రైవర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమె అతనితో ఏకంతంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని జార్జ్‌ను ప్రియురాలు బెదిరించింది.. దీంతో భయపడిపోయిన అతను పారిపోయాడు’’ కాగా… వధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.