పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మంది పోటీ పడ్డారు.కాగా, పురుషుల విభాగంలో బార్హ్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ విజేతగా నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 420 గ్రాముల పెరుగు తిన్నాడు. మహిళల విభాగంలో పాట్నాకు చెందిన ప్రేమ తివారీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 3 నిమిషాల్లో 2 కిలోల 718 గ్రాముల పెరుగు తిన్నది.