ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఏప్రిల్ 1న జరిగే కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.