హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender)కు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. ఆయనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈటలకు ‘‘వై కేటగిరీ(Y category)’’ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం వుంది. తన భర్తను హత్య చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)ప్లాన్ చేస్తున్నాడంటూ ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ఇవాళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పాడి కౌశిక్ రెడ్డి నుండి తన భర్తకు ప్రాణ హాని ఉందని ఈటల జమున (EtalaJamuna) ఆరోపించిన గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు.. నయీం (Naeem) వంటి వ్యక్తులు బెదిరిస్తేనే భయపడలేదని చెప్పారు. కౌశిక్ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్ (CMKCR) ఉన్నారని ఈటల జమున ఆరోపించారు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను రూ. 20 కోట్లు ఇచ్చి చంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసీఆర్కు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ది చెబుతారని అన్నారు.