»The Governments Negotiations With The Ration Dealers Have Been Successful
Telangana : రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం ..సమ్మె విరమణ
తెలంగాణ (Telangana) రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లకు సర్కార్ సానుకూలంగా స్పందించడంతో సమ్మె నిర్ణయాన్ని విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు (Ration dealers) ప్రకటించారు.
పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఓ సామాజిక బాధ్యత అన్న విషయాన్ని డీలర్లు మరవద్దన్నారు. తెలంగాణ (Telangana) ప్రభుత్వం రేషన్ డీలర్లతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సమ్మె నిర్ణయాన్ని రేషన్ డీలర్లు విరమించుకున్నారు. . రేషన్ డీలర్లు మొత్తం 22 అంశాలను ప్రభుత్వం ముందుంచారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్ 5 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ సంఘాలతో మంత్రి గంగుల చర్చలు జరిపారు. . రేషన్ డీలర్లు (Ration dealers) మొత్తం 22 అంశాలను ప్రభుత్వం ముందుంచారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్ 5 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సచివాలయం(Secretariat)లో రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ సంఘాలతో మంత్రి గంగుల చర్చలు జరిపారు.