ASR: డుంబ్రిగూడ మండలం కొర్రాయి గ్రామంలో మంగళవారం తహసీల్దార్ త్రివేణి ప్రభుత్వ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు ఆఫ్ రైట్, సర్వే నివేదికలు, పబ్లిక్ గ్రీవెన్స్, సివిల్ సప్లయ్, పెన్షన్లు, అంగన్వాడీ టేక్ హోమ్ రేషన్ వంటి పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.