WGL: గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలో గల శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అలంకరణలు చేసి, వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు చేసారు. అలాగే స్వామికి మహా హారతి ఇచ్చారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు.