తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు సాధ్యమైనన్ని రకాలు చర్యలు తీసుకుంటోంది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఆదివారం సమావేశమయ్యారు.
Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు సాధ్యమైనన్ని రకాలు చర్యలు తీసుకుంటోంది. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ ఆదివారం సమావేశమయ్యారు. వీరి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరు చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు రఘురామ్ రాజన్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.